యువకుడిని ఢీకొన్న ఇసుకలారీకి నిప్పు.. పోలీసులపై దాడి - latest crimes in kamareddy
20:02 December 28
యువకుడిని ఢీకొన్న ఇసుకలారీకి నిప్పు.. పోలీసులపై దాడి
కామారెడ్డి జిల్లా బిచ్కుందలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇసుక లారీ ఢీకొని ఓ యువకుడికి ఈ తీవ్ర గాయాలయ్యాయి. లారీ కింద పడిన యువకుడి శరీరమంతా నుజ్జునుజ్జయింది. ఆగ్రహించిన స్థానికులు ఇసుక లారీలను రోడ్డుపైన అడ్డుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీకి నిప్పు పెట్టారు.
ఇసుక లారీల అద్దాలను ధ్వంసం చేశారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులను తరిమికొట్టారు. సీఐతో పాటు పోలీసులపైనా దాడి చేశారు. ప్రమాదానికి గురైన యువకుడు విజయ్ బిచ్కుంద మండలం గుపాన్ పల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. తీవ్ర గాయాలైన యువకుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: గల్లంతైన యువకుని మృతదేహం లభ్యం