తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

సడెన్​ బ్రేకేసిన లారీ... వరుసగా ఢీకొన్న కార్లు - rajapur accident news

జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న లారీ ఒక్కసారిగా బ్రేక్​ వేయటం వల్ల ప్రమాదం జరిగింది. లారీ వెనక వరుసగా వస్తున్న మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదం మహబూబ్​నగర్ జిల్లా రాజాపూర్ సమీపంలో జరిగింది.

lorry and cars accident near rajapur highway
lorry and cars accident near rajapur highway

By

Published : Nov 26, 2020, 4:06 PM IST

మహబూబ్​నగర్ జిల్లా రాజాపూర్ సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. సూర్యజ్యోతి కాటన్ మిల్ సమీపంలో జడ్చర్ల వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ వేగంగా వస్తూ... ఒక్కసారిగా బ్రేకులు వేసింది. ఈ క్రమంలో లారీ వెనక వస్తున్న కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో మూడు కార్లు పాక్షికంగా దెబ్బతినగా... ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతాగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన వల్ల రహదారిపై పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: కారును ఢీకొట్టిన స్కూటీ.. ఒకరు దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details