ప్రమాదవశాత్తు లారీ కిందపడి మరో లారీ డ్రైవర్ మృతిచెందిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం తరాలపల్లిలో చోటుచేసుకుంది. గ్రామంలోని క్వారీ వద్ద జేసీబీ సాయంతో లారీల్లో మట్టిని నింపి బయటకు తరలిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మట్టిని తీసుకొని వెళ్లేందుకు అక్కడకు వచ్చిన వీరస్వామి అనే డ్రైవర్ నడుచుకుంటూ వస్తుండగా... వెనకకు వస్తున్న మరో లారీ ఆయన పై నుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో వీరస్వామి అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాదవశాత్తు లారీకింద పడి డ్రైవర్ మృతి - వరంగల్ లేటెస్ట్ అప్డేట్స్
వరంగల్ అర్బన్ జిల్లా తరాలపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు లారీ కింద పడి మరో లారీ డ్రైవర్ మృతి చెందారు. లారీ వెనుకకు వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లుగా స్థానికులు తెలిపారు.
ప్రమాదవశాత్తు లారీకింద పడి డ్రైవర్ మృతి
మృతునిది జనగామ జిల్లా చిల్పూర్ మండలం రాజవరం గ్రామం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:ఆగి ఉన్న టిప్పర్ను ఢీ కొట్టిన బైక్..