తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రాజేంద్రనగర్​లో చిరుత హల్​చల్​.. భయాందోళనలో స్థానికులు - రాజేంద్ర నగర్​లో చిరుత కలకలం

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత పులి కలకలం రేపింది. స్థానికంగా ఉన్న వాలంతరి రైస్ రీసెర్చ్ సెంటర్ సమీపంలో చిరుత సంచారం చేసినట్లు స్థానికులు తెలిపారు.

leopard killed two calves in rajendra nagar hyderabad
రాజేంద్రనగర్​లో చిరుత హల్​చల్​.. భయాందోళనలో స్థానికులు

By

Published : Oct 10, 2020, 11:14 AM IST

హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత పులి కలకలం సృష్టించింది. వాలంతరి రైస్ రీసెర్చ్ సెంటర్ సమీపంలో సంచారం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అర్ధరాత్రి రెండు ఆవు దూడలను చిరుత చంపినట్లు వెల్లడించారు. పోలీసులు, అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించినా వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో ఒకసారి ఫిర్యాదు చేస్తే అధికారులు బోన్లు, కెమెరాలు ఏర్పాటు చేసి పులి ఉందని నిర్ధారణ అయినా తగిన చర్యలు తీసుకోలేదని ఓ పశువుల కాపరి వాపోతున్నారు.

భయాందోళనలకి గురైన స్థానికులు ఈ సారైనా తమ ప్రాణాలు కాపాడమని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి:పేదల పక్షపాతి సీఎం కేసీఆర్: సత్యవతి రాథోడ్​

ABOUT THE AUTHOR

...view details