ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలవాసులను పులి భయం వీడటం లేదు. మంగళవారం రోజున తాంసి-కె అటవీ ప్రాంతంలో ఆవు, లేగదూడ రెండు హతమవడం స్థానికంగా భయాందోళనకు దారితీసింది. మృత్యువాతపడ్డ పశువులు గ్రామానికి చెందిన వాన్‌కడే దామోదర్‌విగా గుర్తించారు. తాంసి నుంచి హత్తిఘాట్‌కు వెళ్లే దారిలో ఈ ఘటనలు వెలుగుచూశాయి.
తాంసి-కెలో పులి కలవరం... ఆవు, దూడ హతం
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో పులి కలకలం రేపుతోంది. వరుసదాడులతో పరిసర ప్రాంతాల ప్రజలను భయాందోళనలో ముంచేసింది. తప్పిపోయిన రెండు పశువులను వెతుకుతున్న క్రమంలో పులి దాడి వెలుగుచూసింది.
leopard attack in bheempur mandal area
సోమవారం రోజున రెండు పశువులు కనిపించకపోవటం వల్ల వాటి జాడ కోసం వెతకగా.. పులి దాడి బయటపడింది. అటవీఅధికారులకు సమాచారం ఇచ్చినట్లు సర్పంచి కరీం తెలిపారు. వారం పది రోజుల్లో జరిగిన పులి వరసదాడులతో పరిసర గ్రామస్థులు బెంబేలెత్తుతున్నారు.