ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, బంధువులను బోయిన్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఖిలప్రియ భర్త భార్గవరామ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో వారిని ప్రశ్నిస్తున్నారు. మంగళవారం రాత్రి బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్, ఆయన సోదరుల అపహరణ వ్యవహారంలో అఖిలప్రియను అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో అఖిలప్రియను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లనున్నారు.
పోలీసుల అదుపులో అఖిలప్రియ.. పరారీలో భర్త భార్గవరామ్
12:06 January 06
పోలీసుల అదుపులో అఖిలప్రియ.. పరారీలో భర్త భార్గవరామ్
ఆదాయపన్ను అధికారులమంటూ.... హైదరాబాద్‌లో ముగ్గురు అన్నదమ్ములను అపహరించిన ఘటన అర్ధరాత్రి హైరానాపుట్టించింది. సీఎం కేసీఆర్ సమీప బంధువు, జాతీయ బ్యాడ్మింటన్ మాజీ ఆటగాడైన ప్రవీణ్‌రావు ఆయన సోదరులు నవీన్‌రావు, సునీల్‌రావు సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని మనోవికాస్‌నగర్‌లో నివాసముంటున్నారు. ఐటీ అధికారులమంటూ ప్రవీణ్‌రావు ఇంట్లోకి ముగ్గురు వ్యక్తులు చొరబడ్డారు. ప్రవీణ్, ఆయన సోదరులను బెదిరించి తమవెంట తీసుకెళ్లారు. వారితో పాటు ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లు కూడా పట్టుకుపోయారు.
పేపర్లపై సంతకాలు
ఘటన జరిగిన వెంటనే బాధితుల సోదరుడు ప్రతాప్‌రావు అందించిన సమాచారం మేరకు హైదరాబాద్ నార్త్ జోన్ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. కిడ్నాప్ చేసి ముగ్గురిని ఒక ఫాంహౌస్‌కు తీసుకెళ్లారు. అక్కడి వారితో పలు పేపర్లపైన సంతకాలు తీసుకున్నారని ప్రవీణ్‌రావు సోదరుడు ప్రతాప్‌రావు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత ముగ్గురిని నార్సింగి వద్ద వదిలి కిడ్నాపర్లు పరారయ్యారు. నిందితులను పోలీసుల అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
భూ వివాదాలే కారణం!
కిడ్నాప్ చేసిన వ్యక్తులెవరో తమకు తెలుసునని... పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వారి గురించి వివరించినట్లు బాధితుల సోదరుడు ప్రతాప్‌రావు తెలిపారు. భూలావాదేవీల అంశానికి సంబంధించే కిడ్నాప్ చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కిడ్నాప్ వ్యవహారంలో అఖిలప్రియను పోలీసులు అదుపులోకి తీసుకుని... బేగంపేటలోని లెర్నింగ్ సెంటర్‌కు తీసుకెళ్లారు.
ఇదీ చదవండి:బోయిన్‌పల్లి కిడ్నాప్ ఘటన సుఖాంతం