ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపుడి వద్ద కారులో తరలిస్తున్న రూ.6 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను ఖమ్మం టాస్క్ఫోర్సు పోలీసులు పట్టుకున్నారు.
రూ. 6 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపూడి వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కా ప్యాకెట్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 6 లక్షలు ఉంటుందని తెలిపారు.
రూ. 6 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
గన్నవరం గ్రామానికి చెందిన మల్లిఖార్జున్ అనే వ్యక్తి కారులో నిషేధిత గుట్కాని తరలిస్తున్నట్టు సమాచారం అందిన ఏసీపీ, సీఐ ఆ వ్యక్తితో పాటు కారు, గుట్కా సంచులను వైరా పోలీస్స్టేషన్లో అప్పగించారు. నిందితుడిని టాస్క్ఫోర్సు పోలీసులు గడచిన రెండు నెలల్లో మూడుసార్లు పట్టుకోవడం గమనార్హం.
ఇదీ చదవండి:విరాళాల వెల్లువలు... ఆపదలో సినీ ప్రముఖుల ఆపన్నహస్తం