జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలోని కిరాణా దుకాణాల్లో నిషేధిత గుట్కా, అంబర్ అమ్ముతున్నారన్న పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్ సీఐ గండ్రాతి మోహన్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.
టాస్క్ఫోర్స్ దాడుల్లో.. నిషేధిత గుట్కా పట్టివేత
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలోని కిరాణ దుకాణాల్లో నిషేధిత గుట్కా, అంబర్ అమ్ముతున్నారన్న సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి భారీ ఎత్తున గుట్కా స్వాధీనం చేసుకున్నారు.
టాస్క్ఫోర్స్ దాడుల్లో.. నిషేధిత గుట్కా పట్టివేత
పలు దుకాణాల్లో సోదాలు చేసిన పోలీసులకు రూ.40వేల విలువ చేసే నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకున్నారు. అక్రమ వ్యాపారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. దాడుల్లో టేకుమట్ల ఎస్సై రమణా రెడ్డి, టాస్క్ఫోర్స్ సిబ్బంది ఏఎస్సై గోపాల్ రెడ్డి, సిబ్బంది సత్యనారాయణ, ప్రవీణ్, రవీందర్ తదితరులు దాడుల్లో పాల్గొన్నారు.
ఇదీ చూడండి:కరోనాను నశింపజేసే నమూనా తయారు చేసిన బీటెక్ విద్యార్థి