బోరబండ పరిధిలోని ఎన్‌ఆర్‌ఆర్ పురంలో రూ. 3లక్షల విలువైన నిషేధిత గుట్కాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి..ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
బోరబండలో రూ. 3లక్షల విలువైన గుట్కా పట్టివేత - రూ. 3లక్షల విలువైన నిషేధిత గుట్కా
ప్రభుత్వ నిషేధిత గుట్కాను నిల్వ ఉంచిన గోదాంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. భారీ గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన బోరబండలో చోటుచేసుకుంది.
బోరబండలో రూ. 3లక్షల విలువైన గుట్కా పట్టివేత
నిందితుడు మహాదేవ్‌పటేల్ ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున గుట్కాను తీసుకువచ్చి గోదాంలో నిల్వ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడు విశ్వనాథ్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని.. గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.