కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని ఓ ఇంట్లో పోలీసులు దాడులు నిర్వహించారు. గోలెం తిరుపతి అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 12 లక్షల 27 వేల విలువచేసే గుట్కా, ఒక లక్ష యాభై తొమ్మిది వేల రూపాయలు విలువచేసే రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రెబ్బెనలో అక్రమ దందాలకు అడ్డుకట్ట... ముగ్గురు వ్యక్తులు అరెస్టు - రెబ్బెనలో అక్రమ దందా గుట్టురట్టు
కుమురంభీం జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో నిషేదిత గుట్కా అక్రమ దందా గుట్టురట్టైంది. ఓ ఇంట్లో నిల్వ ఉంచి రూ. 12లక్షల 27 విలువచేసే గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
కాగజ్‌నగర్‌కు చెందిన ఇంతియాజ్ అనే వ్యక్తిపై గతంలో అక్రమ దందాలపై 15 కేసులు నమోదయ్యాయని.. అయినా ఎలాంటి భయం లేకుండా విచ్చలవిడిగా అక్రమ దందాకు తెరలేపాడని పేర్కొన్నారు. రెబ్బెన మండలం నుంచి గోలెం తిరుపతి, కొలిపాక కిరణ్ అనే వ్యక్తులతో మూకుమ్మడిగా నిషేధిత గుట్కా, ప్రభుత్వము పేదలకు ఇస్తోన్నటువంటి ఉచిత బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి రవాణా చేస్తున్నారని తెలిపారు. ఆసిఫాబాద్‌లో ఎవరైనా అక్రమ వ్యాపారాలకు పాల్పడితే ఊరుకునేది లేదని వారిపై కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చూడండి:పీవీ గ్లోబల్ ఇండియా రూపశిల్పి.. : కేసీఆర్