నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల పరిధిలోని స్వర్ణ గ్రామ శివారులో ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రలోని హిమాయత్ నగర్‌కు అక్రమంగా తరలిస్తున్న నిషేధిత తంబాకు పొట్లాలను పోలీసులు పట్టుకున్నారు. సారంగాపూర్ పరిధిలోని స్వర్ణ గ్రామ శివారులో సీసీఎస్ సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా ఎంహెచ్ 26 బీ, 5785 అనే బొలెరో వాహనాన్ని సోదా చేయగా.. అందులో రూ.2,19,120 విలువ చేసే నిషేధిత తంబాకు పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాం నర్సింహారెడ్డి తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్న తంబాకు పట్టివేత! - నిషేధిత గుట్కా పట్టివేత
ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న నిషేధిత తంబాకు పొట్లాలను సారంగాపూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రెండున్నర లక్షల విలువ చేసే నిషేధిత తంబాకు పొట్లాలను, వాటిని తరలిస్తున్న వాహనాన్ని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్న తంబాకు పట్టివేత!