భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లింగాపురంలో ఓ పూరిల్లు దగ్ధమైంది. గ్రామానికి చెందిన కొంగురు సత్యం కుటుంబ సభ్యులతో ఇంట్లో ఉండగా... పెద్ద శబ్ధం వచ్చి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమై... బయటకు పరుగులు తీశారు. దీంతో సత్యం కుటుంబ సభ్యులతో క్షేమంగా బయటపడ్డాడు. ఇంట్లో వంట సామాగ్రి, నిత్యవసర సరకులు, ఇతర వస్తువులు మంటల్లోనే కాలిపోయాయి. గ్యాస్ లీక్ కావడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు.
గ్యాస్ లీకై పూరిల్లు దగ్ధం.. కుటుంబసభ్యలు క్షేమం - లింగాపురంలో పూరిల్లు దగ్ధం
గ్యాస్ లీకై... పూరిల్లు దగ్ధమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లింగాపురంలో చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమై ఇంట్లో ఉన్నవారంతా బయటకు పరుగులు తీయడం వల్ల క్షేమంగా ఉన్నారు.
గ్యాస్ లీకై పూరిల్లు దగ్ధం.. కుటుంబసభ్యలు క్షేమం