తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

భార్య కోసం పిల్లలతో కలిసి విద్యుత్ స్తంభంపై నిరసన - తెలంగాణ వార్తలు

భార్య కాపురానికి రావడం లేదని ఓ భర్త విద్యుత్ స్తంభం ఎక్కారు. తనతో పాటు ముగ్గురు పిల్లలను ఎక్కించారు. తన భార్య రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడికి సర్ది చెప్పారు.

husband-protest-for-wife-with-kids-on-electric-pole-veepangandla-mandal-wanaparthy
భార్య కోసం పిల్లలతో కలిసి విద్యుత్ స్తంభంపై నిరసన

By

Published : Jan 11, 2021, 8:11 PM IST

భార్య కాపురానికి రావడం లేదని ఆవేదనతో ఓ భర్త విద్యుత్ స్తంభం ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కొల్లాపూర్ వలవాపురం తండాకి చెందిన చందు నాయక్, వరలక్ష్మిలకు 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తలిద్దరూ తరుచూ ఘర్షణ పడేవారు. వరలక్ష్మి కాపురానికి రాకుండా వాళ్ల తల్లిగారింటికి వెళ్లిందని భర్త చందు నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.

వీపనగండ్ల మండల కేంద్రంలో పిల్లలతో కలిసి విద్యుత్ స్తంభం ఎక్కారు. భార్య కాపురానికి రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. తండ్రితో పాటు పిల్లలూ స్తంభం ఎక్కడం స్థానికంగా కలకలంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి చందు నాయక్‌కు సర్ది చెప్పారు. అతడిని, పిల్లలను స్తంభం నుంచి కిందకు దింపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వహిద్ అలీ బేగ్ తెలిపారు.

ఇదీ చదవండి:భార్యని చంపి... చాపలో చుట్టి మాయం చేద్దామనుకున్నాడు!

ABOUT THE AUTHOR

...view details