హైదరాబాద్ మూసాపేట పరిధిలో గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వెంకట్రావు, భవాని దంపతులు 15ఏళ్ల క్రితం నగరానికి వలసొచ్చారు. మూసాపేట ప్రగతినగర్‌లో నివాసం ఉంటున్న వీరికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు నవీన్(8) స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. తండ్రి సెంట్రింగ్ పనుల గుత్తేదారు కాగా తల్లి గృహిణి. నవీన్ ఎవరికీ చెప్పకుండా మిత్రులతో కలిసి ఈతకు వెళ్లాడు.
కళ్లెదుటే కొనఊపిరితో కుమారుడు.. ఫలించని తల్లి ప్రయత్నం - హైదరాబాద్ వార్తలు
కన్నబిడ్డ తన కళ్ల ముందే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. చావుకు..బతుకుకు మధ్య ఊగిసలాడుతున్నాడు. తన గారాలపట్టిని ఆ పరిస్థితిలో చూసి అమ్మ అల్లాడిపోయింది. ఎలాగైనా బతికించాలి..చిన్నారిని గెలిపించాలి. ఎన్నో ప్రయత్నాలు చేసింది. కృత్రిమ శ్వాస అందించాలనే ఆలోచన వచ్చిందే తడువుగా లేని ఓపికను తెచ్చుకుని..శక్తినంతా కూడదీసుకుని ఊపిరి అందించింది. ఆసుపత్రికి తరలించింది. అయినా కన్నబిడ్డ ప్రాణం నిలవలేదని తెలుసుకుని కుప్పకూలిపోయింది.
అందరూ ఐడీఎల్ కంపెనీ ఖాళీ స్థలం రంగనాయకస్వామి ఆలయం సమీపంలోని నీటిగుంతలో దిగారు. నవీన్ ప్రమాదవశాత్తు అందులో మునిగిపోయాడు. ఈ హఠాత్పరిణామంతో భయపడిన తోటి చిన్నారులు బాధితుని ఇంటికి వెళ్లి జరిగిన ఘోరాన్ని తల్లి భవానికి వివరించారు. ఆమె పరుగున అక్కడికి చేరుకుని ఏడుస్తూనే సాయం కోరింది. సమీపంలో వారు బాలుడిని బయటకు తీశారు. అప్పటికీ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నట్టు గుర్తించి నీటిని కక్కించారు. అయినా శ్వాస అందక ఇబ్బందిపడుతున్న కుమారుడిని బతికించుకోవాలన్న తాపత్రయంతో తల్లి నోటి ద్వారా కృత్రిమ శ్వాసనూ అందించింది. తర్వాత కూకట్‌పల్లి పోలీసు ప్యాట్రోలింగ్ వ్యానులో ఆసుపత్రికి తరలించారు. బాలుడు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో తల్లి కన్నీటిపర్యంతమైంది.
ఇవీ చూడండి:వివాహితతో గొడవపడ్డాడు... మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు