యాదాద్రి భువనగిరి పట్టణ శివారులోని డాల్ఫిన్ హోటల్ వద్ద అక్రమంగా జిలిటెన్ స్టిక్స్, డిటోనేటర్లు తరలిస్తున్న కారును పట్టణ పోలీసులు పట్టుకున్నారు. కారులో తరలిస్తున్న 1792 జిలిటెన్ స్టిక్స్, 1600 డిటోనేటర్స్ను స్వాధీనం చేసుకున్నారు. వాటిని తరలిస్తున్న వెంకట్ రెడ్డి, భాస్కర్ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేలుడు పదార్ధాలు సరఫరా చేస్తున్నారనే పక్కా సమాచారంతో తమ సిబ్బందితో దాడులు నిర్వహించామని పట్టణ సీఐ సుధాకర్ వెల్లడించారు.
పోలీసు దాడుల్లో భారీగా పేలుడు పదార్ధాల స్వాధీనం - bhuvanagiri nera varthalu
కారులో అక్రమంగా తరలిస్తున్న 1792 జిలిటెన్ స్టిక్స్, 1600 డిటోనేటర్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు.. ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు పరారయ్యారు.
పోలీసు దాడుల్లో భారీగా పేలుడు పదార్ధాల స్వాధీనం
వలిగొండ మండలం పైల్వాన్ పూర్ గ్రామానికి చెందిన పాండు రంగారెడ్డి, ఉపేందర్ రెడ్డి వద్ద కొనుగోలు చేసి హైదరాబాద్లోని వెంకట్, శ్రీనులకు వాటిని తరలిస్తుండగా డాల్ఫిన్ వద్ద నిందితులను పట్టుకున్నామని పట్టణ సీఐ సుధాకర్ వెల్లడించారు. మొత్తం ఆరుగురు నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:భూ తగాదాలు: గొడ్డలితో నరికి చంపారు!