లంచం తీసుకుంటూ పట్టుబడిన మహబూబ్‌నగర్ పురపాలక కమిషనర్ సురేందర్ కేసును ఏసీబీ అధికారులు వేగవంతం చేశారు. హయత్‌నగర్‌లోని ఓ బ్యాంకులో సురేందర్‌కు చెందిన లాకర్‌ను ఆయన భార్య సమక్షంలో అధికారులు తెరిచారు. ఇందులో 27లక్షల 44వేల రూపాయల నగదు లభించినట్లు వెల్లడించారు. దీంతో పాటు 808 గ్రాముల బంగారం, 71 గ్రాముల వెండి వస్తువులు ఉన్నట్లు తెలిపారు.
సురేందర్ బ్యాంకు లాకర్లో భారీగా నగదు, బంగారం
లంచం తీసుకుంటూ పట్టుబడిన మహబూబ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ వడ్డే సురేందర్ బ్యాంకు లాకర్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు భారీగా నగదు, బంగారు ఆభరణాలను గుర్తించారు. ఈ నెల 22న ఓ కాంట్రాక్టర్ నుంచి లక్షా 65వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
సురేందర్ బ్యాంకు లాకర్లో భారీగా నగదు, బంగారం
ఈ నెల 22న మహబూబ్‌నగర్ పురపాలక కార్యాలయంలో లంచం తీసుకుంటూ... సురేందర్ అనిశాకు పట్టుబడ్డాడు. క్లోరినేషన్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి కాంట్రాక్టర్ దగ్గర లక్షా 65వేలు తీసుకుంటుండగా అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
ఇవీ చూడండి: ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్ వడ్డే సురేందర్