తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రూ.కోటి పైగా విలువైన గంజాయి పట్టివేత.. వాహనాలు సీజ్​

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పోలీసులు పెద్దఎత్తున గంజాయిని పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 1256 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని, రెండు వాహనాలను సీజ్​ చేశారు.

Heavy amount of ganjai seize in Bhadrachalam police in bhadradri kothagudem district
భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత... వాహనాలు సీజ్​

By

Published : Dec 14, 2020, 7:26 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులు భారీస్థాయిలో గంజాయిని పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్​లోని సీలేరు నుంచి హైదరాబాద్​కు తరలిస్తున్నట్లు గుర్తించారు. రెండు వాహనాల్లో 1256 కేజీల గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వాటి విలువ రూ.కోటి 88 లక్షల విలువ ఉంటుందని భద్రాచలం ఏఎస్పీ డాక్టర్​ వినీత్ తెలిపారు.

ఛత్తీస్​గఢ్ -ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో భద్రాచలం కేంద్రంగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఏఎస్పీ వెల్లడించారు. ప్రతిరోజు ప్రత్యేక నిఘా ఉంచి వాహనాల తనిఖీలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. యువత సులభంగా డబ్బు సంపాందించాలనే దురుద్దేశ్యంతో గంజాయి రవాణాకు తెర తీశారని ఏఎస్పీ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో ప్రభుత్వ పాలన అయోమయంగా ఉంది : భట్టి

ABOUT THE AUTHOR

...view details