తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నాగరాజు బినామీ లాకర్​లో 1256 గ్రాముల బంగారం

కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు అక్రమాస్తుల కేసులో భాగంగా ఏసీబీ అధికారులు అల్వాల్ ఐసీఐసీఐ బ్యాంకులో లాకర్లను తెరిచారు. నాగరాజు బంధువైన నందగోపాల్​కు సంబంధించిన లాకర్​లో 1256 గ్రాముల బంగారు ఆభరణాలు గుర్తించారు.

haevy gold seized in nagaraj brib case
నాగరాజు బినామీ లాకర్​లో 1256 గ్రాముల బంగారం

By

Published : Oct 22, 2020, 3:20 PM IST

మేడ్చల్​ జిల్లా కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు అక్రమాస్తుల కేసులో భారీగా బంగారాన్ని ఏసీబీ సీజ్ చేసింది.​ నాగరాజు బంధువైన నందగోపాల్​కు సంబంధించిన లాకర్​లో 1256 గ్రాముల బంగారు ఆభరణాలను గుర్తించారు. తనిఖీల్లో భాగంగా నాగరాజు దంపతులు నందగోపాల్ లాకర్​ను బినామీ లాకర్​గా ఉపయోగించే వారని అధికారులు నిర్ధరించారు.

తమకు తెలియకుండానే నాగరాజు దంపతులు లాకర్​లో బంగారు ఆభరణాలను దాచినట్లు నందగోపాల్ తెలిపారు. లాకర్​లో ఉన్న స్వర్ణం విలువ రూ. 65 లక్షలు ఉంటుందని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.

ఇదీ చదవండి:నౌకాదళంలో చేరిన 'ఐఎన్​ఎస్ కవరత్తి' యుద్ధనౌక

ABOUT THE AUTHOR

...view details