తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఉప్పల్​లో 13 లక్షల విలువైన గుట్కా పట్టివేత - uppal

పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మార్గాల్లో చేరవేస్తున్న నిషేధిత గుట్కా  రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిఘా వర్గాల సమాచారంతో  విస్తృతంగా దాడులు చేసి నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నారు.

గుట్కాముఠా గుట్టురట్టు

By

Published : Apr 2, 2019, 6:25 AM IST

Updated : Apr 2, 2019, 9:11 AM IST

హైదరాబాద్​లోని ఉప్పల్​లో నిషేధిత గుట్కా అక్రమ రవాణా చేస్తూ.. విక్రయిస్తున్న ఓముఠా గుట్టురట్టయింది. ఉప్పల్​లో ఓ కిరాణా దుకాణంలో నిల్వ ఉంచిన 13 లక్షల విలువైన గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కొన్నిరోజుల కిందట వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు ఉప్పల్ ​నుంచి వరంగల్​కి తరలిస్తున్న 14 వేల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకొన్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. వారిచ్చిన సమాచారంతో కొందరిపై నిఘా ఉంచారు.

పక్కా సమాచారంతో

విశ్వసనీయ సమాచారంతో ఉప్పల్​ ప్రాంతంలోని కిరాణా దుకాణంపై దాడిచేసి గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. యజమాని చంద్రశేఖర్​పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత గుట్కా విక్రయించినా, నిల్వ ఉంచినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అవసరమైతే పీడీయాక్ట్​ ప్రయోగిస్తామని పేర్కొన్నారు.

గుట్కాముఠా గుట్టురట్టు

ఇవీ చదవండి:"అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ ముఠా గుట్టు రట్టు"

Last Updated : Apr 2, 2019, 9:11 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details