తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అధికార పార్టీ నేతల కబ్జాలో ప్రభుత్వ భూమి! - Government land grab in Huzur Nagar

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ పట్టణంలో అధికార పార్టీకి చెందిన మున్సిపల్ ఛైర్​పర్సన్​ భర్త, మామలు భూకబ్జాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లే వెలుగులోకి తీసుకురావడం చర్చనీయాంశమైంది.

government-land-grabbed-by-municipal-chairpersons-family-in-huzurnagar
అధికార పార్టీ నేతల కబ్జాలో ప్రభుత్వ భూమి!

By

Published : Dec 7, 2020, 2:54 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ పట్టణంలోని సర్వే నంబర్ 205, 206లో ఉన్న భూములను అధికార పార్టీకి చెందిన మున్సిపల్ ఛైర్​పర్సన్​ భర్త, మామలు కబ్జా చేశారని ఆ పార్టీ కౌన్సిలర్లే ఆరోపించారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని మున్సిపల్ కమిషనర్​ నోటీసులు ఇచ్చినా.. పట్టించుకోలేదని తెలిపారు.

అధికార పార్టీ నేతల కబ్జాలో ప్రభుత్వ భూమి!

సుమారు వేయి గజాల ప్రభుత్వ స్థలాన్ని అన్యాయంగా ఆక్రమించారని.. ఈ భూమిని కాపాడాలని అధికారులను కోరారు. అధికార పార్టీ నాయకులే ఇలా చేస్తే ఎలా అని స్థానికులు నిలదీశారు. ఆరేళ్లుగా కబ్జా కోరల్లో ఉన్న ఈ భూమిని ఇప్పటి వరకు అధికారులు కాపాడలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details