శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ.70లక్షల విలువైన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 14న మస్కట్ నుంచి శంషాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడిని డీఆర్‌ఐ అధికారులు తనిఖీ చేశారు. ద్రవరూపంలో ఉన్న బంగారాన్ని లెథర్ బెల్ట్‌లో పెట్టి అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. బెల్ట్‌ను స్వాధీనం చేసుకుని కరిగించారు. దీని బరువు సుమారు 1400 గ్రాములు ఉందని, విలువ రూ.46.25 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ నెల 13న మరో ప్రయాణికుడి నుంచి రూ.24.57లక్షల విలువైన 738 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. డీఆర్‌ఐ అధికారులు ఈకేసును విచారిస్తున్నారు.
అక్రమాలకు ఎన్ని ఎత్తులో.... - samshabad airport
బంగారం అక్రమ రవాణా కోసం కేటుగాళ్లు రోజుకోరకమైన మోసానికి పాల్పడుతున్నారు.ఎన్ని ఎత్తులు వేసినా పోలీసులకు చిక్కి కటకటాలపాలవుతున్నారు.
బెల్టులో బంగారం