పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరులో విషాదం చోటు చేసుకుంది. గ్రామ చెరువులో ఈతకు వెళ్లిన తాత, ముగ్గురు మనవళ్లు ప్రాణాలు కోల్పోయారు. శనివారం మధ్యాహ్నం కొలనూరు చెరువులో ఈత కొట్టేందుకు పాతూరు రాజయ్య తన ముగ్గురు మనువళ్లను తీసుకెళ్లారు. ప్రమాదవశాత్తు చెరువులో నలుగురూ మునిగిపోయారు. శనివారం రాత్రి రాజయ్యతో పాటు మనవడు సిద్ధార్థ మృతదేహం వెలికి తీయగా ఇవాళ ఉదయం మరో ఇద్దరు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలాన్ని పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సందర్శించి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.
తాత, ముగ్గురు మనవళ్లను మింగేసిన చెరువు - died
పెద్దపల్లి జిల్లా కొలనూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఈత కోసం వెళ్లిన ముగ్గురు మనవళ్లు గల్లంతయ్యారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తాత, ముగ్గురు మనవళ్లను మింగేసిన చెరువు