మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలం సంగాయిపల్లి గ్రామంలో అప్పుల బాధ భరించలేక రైతు ర్యాల దుర్గయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. రెండెకరాల వ్యవసాయ భూమిలో దుర్గయ్య వరి పంట వేశాడు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట పూర్తిగా దెబ్బతిన్నది.
మెదక్ జిల్లాలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య - అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
వ్యవసాయంలో నష్టం వాటిల్లి.. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలంలో చోటు చేసుకుంది. వర్షాలకు దెబ్బతిన్న పంటను చూసి.. తీవ్ర మనస్తాపానికి గురై.. ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
మెదక్ జిల్లాలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
అప్పు తెచ్చి.. పంట సాగు చేసిన దుర్గయ్య వరదల్లో పంట మునిగిపోవడం తట్టుకోలేకపోయాడు. తీవ్ర మనస్తాపానికి గురైన దుర్గయ్య ఇంటి ఆవరణలోని దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. భార్య కాంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై గౌస్ తెలిపారు.