తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కలప దొంగలపై కొరడా - FOREST

కలప అక్రమ రవాణాదారులపై అటవీశాఖ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. సరిహద్దు జిల్లాల్లో మెరుపుదాడులతో అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో పదిరోజులుగా విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.

కలప అక్రమ రవాణాదారులపై అటవీశాఖ అధికారుల ఉక్కుపాదం

By

Published : Feb 9, 2019, 7:24 AM IST

Updated : Feb 9, 2019, 8:38 AM IST

కలప అక్రమ రవాణాదారులపై అటవీశాఖ అధికారుల ఉక్కుపాదం
కలప అక్రమార్కులపై అటవీశాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టి అటవీ సంపద దేశాలు దాటకుండా అడ్డుకట్ట వేస్తున్నారు. మహబూబాబాద్ మండలం అనంతారం గ్రామంలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన టేకును అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అటవీ సంరక్షణ చర్యల్లో భాగంగా కలప కోత మిల్లులపై సంగారెడ్డి జిల్లా అటవీ, పోలీసు శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. జహీరాబాద్‌ పట్టణంతో పాటు రంజోల్‌ గ్రామాల్లోని 20 కలప కోత మిల్లుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు జరిపారు. అక్రమంగా నడుపుతున్న పది మిల్లులపై కేసులు నమోదు చేసి జప్తు చేశారు. మిల్లుల్లోని కోత యంత్రాలు, సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇటుక బట్టీల్లో కలప కాల్చడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష రూపాయల జరిమానా విధించారు.
కలప వ్యాపారులు సంబంధిత చట్టానికి లోబడి పనిచేస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదని చెప్పారు అధికారులు. సామిల్లులకు వస్తున్న కలప ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వస్తు రూపంలోకి మారింది, ఎక్కడికి వెళ్లింది అనేవి సరైన రికార్డులు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Last Updated : Feb 9, 2019, 8:38 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details