జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరేళ్ల వద్ద ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ క్యాబిన్లో చిక్కుకున్నాడు. బస్సులో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి.
ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఐదుగురికి గాయాలు - Jagtial district road accident
ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరేళ్ల వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ క్యాబిన్లో చిక్కుకోగా.. నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
జగిత్యాలలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
మంచిర్యాల జిల్లాకు చెందిన లారీ.. కామారెడ్డి జిల్లా గాంధారి నుంచి మంచిర్యాల జిల్లా దేవాపూర్‌కు ఎర్రమట్టిని తరలిస్తుండగా.. ఎయిర్ లాక్ అయింది. అందువల్ల నేరేళ్ల జాతీయ రహదారి వద్ద డ్రైవర్ లారీని నిలిపాడు. హైదరాబాద్ నుంచి ధర్మపురి వస్తున్న బస్సు... లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి :ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం