మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారంలోని పూజా సామగ్రి దుకాణంలో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. దుకాణంలో పెద్దఎత్తున మంటలు ఎగసిపడటాన్ని గమనించిన స్థానికులు.. అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
పూజా సామగ్రి దుకాణంలో అగ్ని ప్రమాదం - అగ్ని ప్రమాదం వార్తలు
మేడ్చల్ జిల్లా నాగారంలోని పూజా సామగ్రి దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా దుకాణంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
పూజా సామగ్రి దుకాణంలో అగ్ని ప్రమాదం.. వాటిల్లిన ఆస్తి నష్టం
షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని దుకాణం యజమాని తెలిపాడు. భారీ స్థాయిలో ఆస్తినష్టం వాటిల్లిందని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:వైద్యుల నిర్లక్ష్యం: బస్టాండ్‌లో మృతి చెందిన మహిళ