తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కాటన్‌ కర్మాగారంలో అగ్నిప్రమాదం... - కామారెడ్డి జిల్లా వార్తలు

కామారెడ్డి జిల్లా రామేశ్వరపల్లిలోని కాటన్ కర్మాగారంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. యంత్రాలను స్టార్ట్ చేస్తుండగా షార్ట్ సర్య్కూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సుమారు రూ.8లక్షలు విలువ చేసే ఆస్తి నష్టం జరిగిందని బాధితులు వాపోయారు.

fire-accident-at-cotton-company-at-rameswarapally-in-kamareddy
కాటన్‌ కర్మాగారంలో అగ్నిప్రమాదం... రూ.8లక్షల ఆస్తినష్టం

By

Published : Nov 19, 2020, 5:36 PM IST

కామారెడ్డి జిల్లా రామేశ్వరపల్లి గ్రామ శివారులోని హిందుస్థాన్ కాటన్ కర్మాగారంలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. యంత్రాలను స్టార్ట్ చేస్తుండగా... ఒక్కసారిగా మంటలు వచ్చాయని బాధితులు తెలిపారు. ఫ్యాక్టరీలో ఉన్న దూదితో పాటు ఇతర సామగ్రి పూర్తిగా కాలి బూడిదైంది. కర్మాగారంలో ఉన్న యంత్రాలూ కాలిపోయినట్లు బాధితుడు ఎండీ గౌస్ తెలిపారు.

వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో సుమారు రూ.8 లక్షల విలువచేసే ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:పోలీసుల ఫేస్​బుక్ సందేశాలు.. స్నేహితుల బెంబేలు!

ABOUT THE AUTHOR

...view details