కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా గ్రామంలో 2 నెలల పసికందును కన్నతండ్రి దారుణంగా చంపేశాడు. యాచక వృత్తిలో భాగంగా జూపాడుబంగ్లాకు వచ్చిన బాలిరెడ్డి దంపతులకు గత ఏడాది డిసెంబర్లో ఆడ శిశువు జన్మించింది. వీరు జూపాడుబంగ్లాలోని కేసీ కెనాల్ వద్ద నివాసముంటున్నారు.
దారుణం: 4 నెలల చిన్నారిని నేలకేసి కొట్టి చంపిన తండ్రి - కర్నూలు జిల్లా క్రైమ్ వార్తలు
కర్నూలు జిల్లాలో ఘోరం జరిగింది. కన్నతండ్రే కాలయముడుగా మారాడు. జూపాడుబంగ్లాలో 2 నెలల పసికందును నేలకేసి కొట్టి చంపాడో కిరాతక తండ్రి. భార్యాభర్తల మధ్య తగాదాతో కనికరం లేకుండా చిన్నారిని నేలకేసి కొట్టి చంపేశాడు.
father murder daughter
భర్త మద్యం తాగి భార్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో పాపను చేతుల్లోకి తీసుకున్న బాలిరెడ్డి నేలకేసి కొట్టాడు. దీంతో ఆ చిన్నారి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:కాంగ్రెస్ రాజ్‌భవన్ ఘెరావ్ ఉద్రిక్తం.. ముఖ్య నేతల అరెస్ట్
Last Updated : Jan 19, 2021, 2:24 PM IST