ఏపీలోని ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం తమ్మడపల్లిలో గంగరాజు అనే రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. బండరాయితో మోదుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఇరవై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తన తొమ్మిది ఎకరాల భూమిని దుగ్గెంపుడి వెంకటరెడ్డి అనే వైకాపా నాయకుడు ఆక్రమించాడని రైతు గంగరాజు ఆరోపించారు. ఈ ఆక్రమణపై రైతు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
వైకాపా నేత భూ ఆక్రమణ.. రైతు ఆత్మహత్యాయత్నం! - prakasam dist news
ఇరవై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తన భూమిని వైకాపా నేత ఆక్రమించాడని ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశారు. అధికారులు, పోలీసులు సైతం వైకాపా నాయకుడి పక్షాన్నే మాట్లాడుతున్నారని ఆవేదన చెందిన ఆ రైతు బండరాయితో మోదుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రైతును స్థానికులు మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తనకు న్యాయం చేయాలని, భూమి ఇప్పించాలని రైతు వేడుకుంటున్నారు.
ఈ విషయంపై విచారణకు తహసీల్దార్ ఉమారాణి రైతు పొలం వద్దకు వచ్చారు. అక్కడకి వచ్చిన అధికారులు, పోలీసులు సైతం వైకాపా నాయకుడి పక్షాన మాట్లాడడంతో... ఆవేదన చెందిన రైతు అధికారుల ముందే పురుగుల మందు తాగబోయారు. వెంటనే అక్కడున్న స్థానికులు అడ్డుకున్నారు. పక్కనే ఉన్న బండరాయితో తనకు తానే కొట్టుకోవడంతో రైతు తలకు తీవ్ర గాయమైంది. రక్తస్రావమైన రైతు గంగరాజును మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు.
ఇదీ చదవండి:ప్రేమికుడే హంతకుడా... అత్యాచారం జరిగిందా?