అప్పుల బాధ తాళలేక మరో రైతు తనువు చాలించాడు. ఈ విషాదకర ఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని లింగంపల్లి కలాన్ గ్రామంలో జరిగింది. గడ్డం నారాయణ(55) ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్పుల బాధ తాళలేక అన్నదాత ఆత్మహత్య - farmer suicide in lingampally kalan
అప్పుల బాధతో రైతు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. భూమినే నమ్ముకుని కష్టపడుతున్న కర్షకులు... కాలం వేస్తున్న కాటుకు అదే భూమిలో బూడిదవుతున్నారు. అలాంటి మరో విషాదకర ఘటనే కామారెడ్డి జిల్లాలోని లింగంపల్లి కలాన్లో జరిగింది.
farmer died with debt problems
స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య గడ్డం వెంకవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజయ్య తెలిపారు.