సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం చౌళ్ల తండాకు చెందిన బానోత్ టీక్యా (46) అనే రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే రైతు మృతి చెందిన్టటు తండావాసులు ఆరోపిస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరమ్మాయిలు, ఒక కుమారుడు ఉన్నారు.
పది రోజుల్లో కూతురు వివాహం.. ఇంతలో విద్యుదాఘాతంతో తండ్రి మృతి
పది రోజుల్లో కూతురు పెళ్లి ఉండగా ఓ తండ్రి విద్యుత్ షాక్తో మృతి చెందిన విషాదకర ఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం చౌళ్ల తండాలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
పది రోజుల్లో కూతురు వివాహం.. ఇంతలో విద్యుదాఘాతంతో తండ్రి మృతి
చిన్న కూతురు వివాహం నవంబర్ 7న చేసేందుకు నిశ్చయించారు. ఇంతలో తండ్రి చనిపోవటం వల్ల ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సాయి ప్రశాంత్ తెలిపారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం తుంగతుర్తి దవాఖానకు తరలించారు.