మేడ్చల్ జగద్గిరిగుట్ట సమీపంలో పేలుడు కలకలం రేపింది. యూసఫ్‌ఖాన్ అనే వ్యక్తి రోజులానే.. ఇవాళ కూడా ఆటో ఎక్కుతుండగా కింద ఉన్న చెత్తకుప్పలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీనితో ఆ వ్యక్తి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు.
ఆటో ఎక్కుతుండగా పేలుడు... వ్యక్తికి తీవ్రగాయాలు - Medchal District Crime News
జగద్గిరిగుట్ట సమీపంలో ఆటోలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ వక్తికి గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆటోలో పేలుడు... వ్యక్తికి తీవ్రగాయాలు
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీ చేస్తున్నారు. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఏమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా... అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Last Updated : Oct 24, 2020, 1:41 PM IST