తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అంతర పంటగా గంజాయి మొక్కలు.. పీకేసిన పోలీసులు

అంతర పంటగా గంజాయి మొక్కలను అక్రమంగా సాగు చేస్తున్న ఇద్దరు రైతులపై జహీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొక్కలను పీకేసి పెట్రోలు పోసి కాల్చేశారు. పరారైన రైతుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

excise police seized marijuanas plants in sangareddy district
అంతర పంటగా గంజాయి మొక్కలు.. పీకేసిన పోలీసులు

By

Published : Sep 25, 2020, 5:07 PM IST

అల్లం, చెరుకు తోటల్లో అంతర పంటగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొగుడంపల్లీ మండలం ఉప్పరపల్లి తండాలో అక్రమంగా సాగు చేస్తున్న రూ.12 లక్షల విలువైన 300 మొక్కలను గుర్తించి ఆబ్కారీ సీఐ అశోక్ కుమార్.. సిబ్బందితో కలిసి పీకేశారు. ఎనిమిది నుంచి పది అడుగులకు పైగా పెరిగిన మొక్కలను కుప్పగా చేసి పెట్రోల్ పోసి కాల్చేశారు.

నిషేధిత పంట సాగు చేస్తున్న ఇద్దరు రైతులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పోలీసుల రాకతో పరారైన రైతుల కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు.

ఇదీ చూడండి:'కేంద్ర వ్యవసాయ బిల్లులు రైతులకు గొడ్డలి పెట్టులాంటివి'

ABOUT THE AUTHOR

...view details