నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ముమ్మరంగా మద్యపాన నిషేధ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే శనివారం రాత్రి పెబేర్ సమీపంలో బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 65 సంచుల నల్లబెల్లాన్ని పట్టుకున్నారు. దానితోపాటు పటిక, నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. రెండు ద్విచక్ర వాహనాలు, ఒక బొలెరో వాహనాన్ని సీజ్ చేశారు.
సుమారు 2 వేల కిలోల నల్లబెల్లం సీజ్.. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ - కొల్లపూర్ ఎక్సైజ్ అధికారుల దాడులు తాజా వార్త
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో ఎక్సైజ్‌శాఖ అధికారులు 65 బ్యాగుల నల్లబెలం సంచులను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
సుమారు 2 వేల కిలోల నల్లబెల్లం సీజ్.. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్
భగత్‌సింగ్, రామకృష్ణ, లాలూ అనే ముగ్గురు వ్యక్తులు రాయ్‌చూర్ ప్రాంతం నుంచి బొలెరో వాహనంలో నల్లబెల్లం సంచులను తీసుకువస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఆ 65 బ్యాగుల్లో దాదాపు 1950 కిలోల నల్లబెల్లం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఆ ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శంకర్ వెల్లడించారు.
ఇదీ చూడండి:100 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్.. ఒకరు అరెస్ట్