ఈఎస్ఐ కుంభకోణం కేసులో రూ.4కోట్లు స్వాధీనం - hyderabad news
16:02 September 01
ఈఎస్ఐ కుంభకోణం కేసులో రూ.4కోట్లు స్వాధీనం
ఈఎస్ఐ కుంభకోణం కేసులో నిందితుల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన వైద్య సేవల సంస్థ సంచాలకురాలు దేవికారాణి, ఫార్మాసిస్టు నాగలక్ష్మి కలిసి... ఓ స్థిరాస్తి వ్యాపారి దగ్గర రూ. 4కోట్లు పెట్టుబడిగా పెట్టినట్లు అనిశా అధికారులు గుర్తించారు. ప్లాట్లు, దుకాణాలు కొనుగోలు చేయడానికి వారు ఈ మొత్తాన్ని పెట్టుబడి పెట్టినట్లు బయటపడింది.
ఆ వ్యాపారి నుంచి రూ. 4 కోట్లను అనిశా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వీరిపై ఇప్పటికే అభియోగం నమోదైంది. ఈఎస్‌ఐ కుంభకోణం వ్యవహారంలో నిందితులకు గతంలోనే బెయిల్ లభించింది. తాజాగా రూ.4 కోట్లు బయటపడటం వల్ల ఇతర నిందితులపై కూడా ఏసీబీ దృష్టి సారించింది. వారు కూడా ఈ తరహా పెట్టుబడులు ఏమైనా పెట్టారా...ఆస్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలను అధికారులు ఆరా తీయనున్నారు.