ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా కొమరాడ మండలం పరశురామ్‌పురంలో రైతుపై ఏనుగు దాడి చేసింది. ఘటనలో లక్ష్మీనాయుడు అనే రైతు మృతిచెందాడు. లక్ష్మీనాయుడు వేకువజామున వరి పొలానికి వెళ్లగా... పక్కన ఉన్న టేకు తోటలో ఉన్న ఏనుగు ఒక్కసారిగా అతనిపై దాడి చేసింది. దీంతో రైతు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. రైతు మృతితో పరుశరామ్పురంలో విషాదం నెలకొంది. జిల్లాలో మూడేళ్లలో ఏనుగుల దాడిలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు కొమరాడలో ముగ్గురు, జియ్యమ్మవలసలో ఇద్దరు, గరుగుబిల్లి మండలాల్లో ఒక్కరు ఏనుగుల దాడికి గురై మృతి చెందారు.
రైతుపై ఏనుగు దాడి... అక్కడిక్కడే మృతి
ఏపీ విజయనగరం జిల్లాలో ఓ రైతుపై ఏనుగు దాడి చేసింది. దీనితో ఆ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. జిల్లాలో మూడేళ్లలో ఏనుగుల దాడిలో ఆరుగురు మృత్యువాత పడ్డారు.
ఏనుగు దాడిలో రైతు మృతి
కొన్నేళ్లుగా అడవి ఏనుగులు ఈ ప్రాంతంలో సంచరిస్తూ... పంటలను నష్టపరుస్తున్నాయని స్థానికులు తెలిపారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
- ఇవీ చూడండి:'తెలంగాణ మహిళా పోలీసులు దేశానికే ఆదర్శం'