హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45లో రాత్రి 11 గంటల నుంచి 1 గంట వరకు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు జరిగాయి. మద్యం సేవించి వాహనం నడుపుతున్న 12 మందిపై కేసులు నమోదు చేసినట్లు మారేడ్‌పల్లి ట్రాఫిక్ సీఐ దస్రూ తెలిపారు. ఆరు కార్లు, ఆరు ద్విచక్ర వాహానాలను సీజ్ చేశారు. మద్యం సేవించి వాహానాలు నడపవద్దని సీఐ దస్రూ కోరారు.
డ్రంకెన్ డ్రైవ్ తనీఖీల్లో 12 మందిపై కేసు - crime
వారంతంలో ట్రాఫిక్ పోలీసులు మందుబాబులపై దృష్టి పెట్టారు. శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 12 మంది మందు బాబులపై కేసు నమోదు చేశారు.
జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు