తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కల్తీ కల్లు తాగడం వల్లే మరణించారు

వికారాబాద్‌లో వారం రోజుల క్రితం మరణించిన వారు కల్తీ కల్లు తాగడం వల్లే మృతి చెందినట్లు అబ్కారీ అధికారులు పేర్కొన్నారు. వారి నమూనాలను ఎక్సైజ్ పరిశోధన కేంద్రంలో పరిక్షించగా అందులో ఆల్పాజోలం, డైజోఫాం కలిసినట్టు తేలింది.

Died of alcohol poisoning in vikarabad district
కల్తీ కల్లు తాగడం వల్లే మరణించారు

By

Published : Jan 16, 2021, 8:23 AM IST

వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండలంలో వారం రోజుల క్రితం మరణించిన వారు కల్తీ కల్లు తాగడం వల్లే మృతి చెందినట్లు అబ్కారీ అధికారులు తేల్చారు. వారి నమూనాలను ఎక్సైజ్ పరిశోధన కేంద్రంలో పరీక్షించగా అందులో ఆల్పాజోలం, డైజోఫాం కలిసినట్టు తేలింది. మోతాదుకు మించి కల్తీ చేయడం వల్ల ఇద్దరు మరిణించటమే కాకుండా... 350 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.

ఘటనకు కారణమైన 15 దుకాణాలపై పోలీసులు కేసులు నమోదు చేసి... లైసెన్సులను రద్దు చేసినట్లు వికారాబాద్ అబ్కారీ ఎస్పీ వెల్లడించారు. వీరిని అరెస్ట్ చేసేందుకు అదనపు ఎక్సైజ్ సూపరిటెండెంట్ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:జ్యువెలరీ షాప్​లో 1.20 కిలోల బంగారం చోరీ

ABOUT THE AUTHOR

...view details