నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని పోస్టాఫీస్ వద్ద ఆగిఉన్న కారులో మృతదేహం లభ్యమయింది. మృతుడు హైదరాబాద్ పార్శీగుట్టకు చెందిన శ్రీనివాస్ గౌడ్‌గా పోలీసులు గుర్తించారు.
ఆగి ఉన్న కారులో మృతదేహం.. ఆధార్‌తో మృతుడి గుర్తింపు - nizamabad district crime news
ఆగి ఉన్న కారులో మృతదేహం లభ్యమైన సంఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆగి ఉన్న కారులో మృతదేహం
గుండెపోటు రావడం వల్ల వాహనాన్ని రహదారి పక్కన ఆపి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. కారులో దొరికిన ఆధార్ కార్డుతో మృతుడు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా ప్రాథమిక నిర్ధరణకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.