తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

'తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైతే హత్యానేరం'

భాగ్యనగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు. సైబరాబాద్ పరిధిలో 27 రోజుల్లో 2,351 కేసులు నమోదు నమోదయ్యాయి. మందు బాబుల కారణంగా సామాన్యులు మరణిస్తున్నారని ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్ పేర్కొన్నారు. తాగి వాహనాలు నడిపితే హత్యానేరం కింద కేసు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

dcp vijay kumar said Drunk driving cases should be murder case
'తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైతే హత్యానేరం'

By

Published : Dec 27, 2020, 3:27 PM IST

హైదరాబాద్ మహానగరంలో ఇటీవల తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవ్వడం వల్ల ట్రాఫిక్ పోలీసులు ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నారు. గడిచిన 27 రోజుల్లో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2,351 కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ వెల్లడించారు.

అందులో 1,763 ద్విచక్ర వాహనాలు, 480 కార్లు, 102 ఆటోలు, 6 లారీలు ఉన్నాయని ట్రాఫిక్ డీసీపీ వివరించారు. ఆ వాహనదారులపై చార్జీషీట్‌ వేసి కోర్టుకు సమర్పించినట్లు పేర్కొన్నారు. మొదటిసారి పట్టుబడిన వారికి 10 వేల జరిమానాతోపాటు ఆరు నెలల జైలు శిక్షపడిందన్నారు.

రెండోసారి పట్టుబడిన వారికి రూ.15 వేలు, రెండెళ్ల వరకూ శిక్షపడిందన్నారు. మద్యం సేవించి పట్టుబడిన వారికి మూడు నెలల పాటు లైసెన్స్‌ రద్దు అవుతుందని స్పష్టం చేశారు. వారి లైసెన్స్‌ శాశ్వతంగా రద్దు అవుతుందన్నారు. తాగి వాహనాలు నడపడం వల్ల సామాన్యుల ప్రాణాలు పోతున్నాయని డీసీపీ తెలిపారు. తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైతే హత్యా నేరం కింద కేసులు నమోదు అవుతాయని హెచ్చరించారు.

ఇదీ చూడండి :మరో ముగ్గురు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details