కర్నూల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారును మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని మల్లబోయినపల్లి వద్ద వెనక నుంచి డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు బోల్తా పడి అందులో ఉన్న నవీన్ (28) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతణ్ని కారులో నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.
వెనకనుంచి కారును ఢీకొట్టిన డీసీఎం.. ఒకరికి తీవ్ర గాయాలు - accident at jadcherla in mahabubnagar district
జాతీయ రహదారిపై కారును వెనకనుంచి ఢీకొట్టగా.. కారు బోల్తా పడిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని మల్లబోయినపల్లి వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
జడ్చర్లలో వెనకనుంచి కారును ఢీకొట్టిన డీసీఎం
ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు కాసేపు అంతరాయం కలిగింది. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. గాయపడిన నవీన్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూర్ గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. డీసీఎం వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు ఎస్సై సంసుద్దీన్ తెలిపారు.
- ఇదీ చూడండి:-చైనా యాప్‌లకు ఇవి ప్రత్యామ్నాయం.. ట్రై చేయండి!