సౌదీలో ఉన్న తన భర్తతో మాట్లాడనివ్వటం లేదన్న కోపంతో అత్తపై కోడలు దాడి చేసింది. ఈ ఘటన హైదరాబాద్ మల్లెపల్లి ఫిరోజ్ గాంధీనగర్లో చోటుచేసుకుంది. బతుకుదెరువు కోసం ఉబిద్ అలీఖాన్ సౌదీకి వెళ్లాడు.
లైవ్ వీడియో: భర్తతో మాట్లాడనివ్వట్లేదని అత్తపై కోడలు దాడి - hyaderabad latest news
కానరాని దేశాల్లో భర్త. అత్త మామల దగ్గర భార్య. ఫోన్లో మాత్రమే కుశల సమాచారాలు. ఆ ఫోను కూడా మాట్లాడనీయట్లేదనే కోపంతో రగిలిపోయిన ఓ కోడలు అత్తపై దాడికి దిగింది. ఆ సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారాయి.
daughter in law attack on mother in law in mallepally
భార్య అత్త, మామల వద్దే ఉంటోంది. ఈ క్రమంలో సౌదీ నుంచి ఉబిద్ ఫోన్ చేస్తే మాట్లాడనివ్వక పోవటం... తన పోషణ గురించి పట్టించుకోవటం వల్ల కోపోద్రిక్తురాలైన కోడలు అత్తపై దాడికి దిగింది. అత్త జుట్టు పట్టుకుని వీధిలోకి ఈడ్చుకొచ్చి మరీ కొట్టింది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఈ ఘటనపై హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ఇదీ చూడండి:హైదరాబాద్లో మళ్లీ చెలరేగుతూ దడ పుట్టిస్తున్న గొలుసు దొంగలు
Last Updated : Oct 9, 2020, 12:44 PM IST