తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ప్రముఖ కంపెనీ నుంచి అంటూ ఫోన్​ చేశారు.. డబ్బులు కాజేశారు

ఓ ప్రముఖ చమురు కంపెనీకి నిత్యం అల్పాహారం సరఫరా చేయడానికి టెండర్లను ఆహ్వానిస్తున్నామంటూ సైబర్​ కేటుగాళ్లు ఓ టిఫిన్​ సెంటర్​ నిర్వాహకుడిని బురిడీ కొట్టించారు. అతని వద్ద నుంచి రూ. 78 వేలు కాజేశారు.

cyber cheating case registered in cyber crime police station
ప్రముఖ కంపెనీ నుంచి అంటూ ఫోన్​ చేశారు.. డబ్బులు కాజేశారు

By

Published : Jul 2, 2020, 2:58 PM IST

హైదరాబాద్​ నగరానికి చెందిన కృష్ణమూర్తి టిఫిన్​ సెంటర్​ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో 2 రోజుల క్రితం ఇండియన్ ఆయిల్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామంటూ కృష్ణ మూర్తికి ఫోన్ చేశారు. తమ కంపెనీకి నిత్యం అల్పాహారం సరఫరా చేయడానికి టెండర్లు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. టెండర్​కు పూచీకత్తు కింద రూ.78 వేలు చెల్లించాల్సి ఉంటుందని నమ్మబలికారు. నిజమేననుకున్న కృష్ణమూర్తి రూ.78 వేలు ఆన్​లైన్​ ద్వారా ట్రాన్స్​ఫర్​ చేశారు.

కొద్ది సేపటి తర్వాత సంబంధిత నెంబర్​కు ఫోన్​ చేయగా.. స్విచ్ఛాఫ్​ వచ్చింది. ఫలితంగా మోసపోయానని గ్రహించిన కృష్ణమూర్తి హైదరాబాద్​ సైబర్​క్రైమ్​ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీచూడండి: ఆర్థిక ప్యాకేజీతో ప్రజలను ఆదుకోవాలి: చాడ

ABOUT THE AUTHOR

...view details