తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మూడు లక్షల విలువైన టపాసులు సీజ్​ చేసిన పోలీసులు

ఓ ఇంట్లో అక్రమంగా నిల్వవుంచిన టపాసులను పెద్దమొత్తంలో టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. కుమురం భీం అసిఫాబాద్​ జిల్లా కౌటాల మండలంలో నిబంధనలకు విరుద్ధంగా నిల్వచేశారన్న సమాచారంతో సోదాలు నిర్వహించారు. నిల్వ ఉంచిన వ్యాపారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Crackers sezed in kumuram bheem asifabad district
మూడు లక్షల విలువైన టపాసులు సీజ్​ చేసిన పోలీసులు

By

Published : Nov 8, 2020, 7:21 PM IST

కుమురం భీం అసిఫాబాద్​ జిల్లా కౌటాల మండల కేంద్రంలో భారీఎత్తున టపాసులను టాస్క్​ఫోర్స్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యాపారి ఇంట్లో నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేశారన్న సమాచారంతో జిల్లా ఇన్​ఛార్జ్​ ఎస్పీ, రామగుండం సీపీ సత్యనారాయణ ఆదేశాలతో పోలీసులు దాడులు చేశారు.

ఈ సోదాల్లో దాదాపు మూడు లక్షల విలువైన టపాసులను సీజ్ చేసి, రాచకొండ ప్రదీప్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. కరోనా దృష్ట్యా టపాసుల వ్యాపార నిర్వహణకు జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ ఝా అనుమతులు నిరాకరించారు. అయినప్పటికీ కొందరు అక్రమంగా విక్రయాలు చేపడుతున్నారు. అక్రమంగా ఎవరైనా వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్​ఛార్జ్ ఎస్పీ సత్యనారాయణ హెచ్చరించారు.

ఇదీ చూడండి:120 కిలోల గంజాయి పట్టివేత.. ఓ వ్యక్తి అరెస్ట్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details