తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

విషాదం మిగిల్చిన కరోనా.. దంపతుల ఆత్మహత్య

కరోనా భయం ఇదరి ప్రాణాలు బలితీసుకుంది. ఏపీలోని అనంతపురం జిల్లా ధర్మవరంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కరోనాతో వారం క్రితమే కుటుంబంలో ఒకరు మృతి చెందారు. వారికి కరోనా సోకింది.. కొద్ది రోజులు క్వారంటైన్​లో ఉండి నెగటివ్ ఫలితాలు రావడంతో రెండు రోజులుగా ఇంటిలోనే ఉంటున్నారు. ఈ రోజు ఉదయం ఇంటి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

విషాదం మిగిల్చిన కరోనా.. దంపతుల ఆత్మహత్య
విషాదం మిగిల్చిన కరోనా.. దంపతుల ఆత్మహత్య

By

Published : Aug 2, 2020, 3:06 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా ధర్మవరంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ధర్మవరం తేరు వీధిలో ఇంటి భవనంపై నుంచి దూకి శిరీష, ఫణిరాజ్ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఫణిరాజ్​ తల్లి వరలక్ష్మి పది రోజుల క్రితం కరోనాతో మృతి చెందింది. పరీక్షల్లో దంపతులకూ కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయినందున... దంపతులు అనంతపురం ఎస్కేయూ క్వారంటైన్‌లో చికిత్స పొందారు. నెగటివ్ ఫలితాలు రావడంతో రెండు రోజులుగా ఇంట్లోనే ఉంటున్నారు.

వీరి పదేళ్ల కుమారుడిని అనంతపురంలోని బంధువుల ఇంటిలో ఉంచారు. కరోన సోకిన తర్వాత భార్యాభర్తలు తీవ్ర మనస్థాపానికి గురయ్యారని స్థానికులు చెబుతున్నారు. పట్టణంలో వీరు కిరాణా దుకాణం నిర్వహించేవారు. అర్ధరాత్రి కుమారుడిని జాగ్రత్తగా చూసుకోవాలని బంధువులకు వాట్సాప్​లో సందేశం పంపారు. అనంతరం ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాలను ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచారు. ధర్మవరం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.

ఇదీ చదవండి:పనిచేసే చోటే కబళించిన మృత్యువు

ABOUT THE AUTHOR

...view details