రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్, ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరి రెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 250 మంది పోలీసులు పాల్గొన్నారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 28 ద్విచక్ర వాహనాలు, 15వేల విలువైన మద్యం, నిషేధిత గుట్కా, పాన్ మసాల ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని...11మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇబ్రహీంపట్నంలో నిర్బంధ తనిఖీలు... - ibrahimpatnam
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రజా క్షేమం కోసమే తనిఖీలు చేస్తున్నట్లు డీసీపీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.
ఇబ్రహీంపట్నంలో నిర్బంధ తనిఖీలు...