తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఊరెళ్లిన యువతి.. ఇల్లు గుల్ల చేసిన దొంగలు - హరినగర్​లో చోరీ

హైదరాబాద్​ సనత్​నగర్​ పీఎస్​ పరిధిలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. బాధితురాలు వృత్తిరీత్యా బెంగళూరుకు వెళ్లగా దొంగలు ఇళ్లు గుల్ల చేశారు. దాదాపు రూ.30 వేల నగదు, 10 తులాల బంగారు నగలు చోరీకి గురైనట్లు యువతి వెల్లడించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

chori in sanath nagar police station limits in hari nagar
సనత్​నగర్​ పరిధిలో చోరీ... నగదు, బంగారు అపహరణ

By

Published : Dec 31, 2020, 7:39 AM IST

నగరంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న ఓ యువతి ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. దాదాపు రూ.30 వేల నగదు, 10 తులాల బంగారు నగలు చోరీకి గురైనట్లు బాధితురాలు వెల్లడించింది. సనత్​నగర్​ పీఎస్​ పరిధిలోని అల్లాపూర్​ డివిజన్​లోని హరినగర్​లో స్వాతి అనే యువతి నివాసముంటోంది.

యువతి వృత్తిరీత్యా బెంగళూరుకు వెళ్లి వచ్చేలోగా ఇంట్లో దొంగతనం జరిగింది. దీంతో బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:ఏడాదిన్నర బాలుడి అదృశ్యం.. పోలీసుల గాలింపు

ABOUT THE AUTHOR

...view details