చేపలవేటకు వెళ్లి నలుగురు చిన్నారుల దుర్మరణం - latest crime news in mahabubabad district
18:17 July 04
చేపలవేటకు వెళ్లి నలుగురు చిన్నారుల దుర్మరణం
మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శనగపురం శివారు తుమ్మల చెరువులో మునిగి నలుగురు బాలురు చనిపోయారు. వీరంతా సమీపంలోనున్న బోడ తండాకు చెందిన లోకేశ్, ఆకాశ్, దినేశ్, జగన్గా గుర్తించారు. వీరంతా 12 నుంచి 14 ఏళ్ల లోపు వయసున్న వారే. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ కాసేపు ఆడి.. ఈత కొట్టి... చేపలు పట్టేందుకు ఉపక్రమించారు.
చెరువులో గుంతలు ఉండడం వల్ల పిల్లలు దిగిన కాసేపటికే నీట మునిగి ప్రాణాలు వదిలారు. బయటకు వెళ్లిన పిల్లలు ఎంతకీ తిరిగిరాకపోవడం వల్ల తల్లిదండ్రులు వారి కోసం గాలింపు చేపట్టగా.. చెరువు వద్ద వారి బట్టలు, చెప్పులు కనిపించాయి. స్థానికులు సాయంతో చెరువు నుంచి మృతదేహాలను బయటకు తీశారు. మహబూబాబాద్ డీఎస్పీ, సీఐ తదితరులు జరిగిన దుర్ఘటనపై వివరాలు సేకరించారు.
ఇవీ చూడండి: కంటోన్మెంట్లోనూ ప్రభుత్వ పథకాల అమలు: తలసాని, మల్లారెడ్డి