రాత్రిళ్లు ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారిని బెదిరించి డబ్బులు, సెల్ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మిగతా ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి నుంచి ఐదు ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
బైక్ ప్రయాణికులే లక్ష్యంగా దారి దోపిడి.. ముఠా అరెస్ట్
రాత్రి వేళల్లో రహదారిపై ప్రయాణిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకొని.. రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
బైక్ ప్రయాణికులే లక్ష్యంగా దారి దోపిడి.. ముఠా అరెస్ట్
దేవరాయాంజల్ నుంచి కొంపల్లి వైపు వెళ్లే రహదారిపై చీకటి పడితే ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకున్న దొంగలు.. బైక్పై వెళ్తున్న వారిని ఆపి బెదిరించి దొంగతనానికి పాల్పడేవారు.
ఇదీ చదవండి:సింగరేణి డంపర్ ఢీకొని వ్యక్తి మృతి.. గ్రామస్థుల ఆందోళన