మెదక్ జిల్లాలో వెల్దుర్తి మండలం మసాయిపేట వద్ద జరిగిన సెల్ఫోన్ల భారీ చోరీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చెన్నై నుంచి దిల్లీకి బయలు దేరిన కంటైనర్ మెదక్ మీదుగా ప్రయాణించి మసాయిపేట సమీపంలోని ఓ దాబా వద్ద ఆగింది. డ్రైవర్లు భోజనం చేసి... అక్కడి నుంచి సుమారు 300 కిలోమీటర్ల తర్వాత ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు చేరుకున్నారు. అనుమానం వచ్చి పరిశీలించగా... చోరీ విషయం బయటపడిందని బాధితులు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.
సెల్ఫోన్ల భారీ చోరీలో దర్యాప్తు ముమ్మరం
అలస్యంగా వెలుగులోకి వచ్చిన రూ.2 కోట్ల విలువైన చరవాణుల చోరి ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు రెండు బృందాలుగా ఏర్పాడి దర్యాప్తు చేస్తున్నారు. కంటైనర్ డ్రైవర్లు ఇచ్చిన సమాచారాన్ని లెక్కలోకి తీసుకుని విచారణ చేపట్టారు.
భారీ చోరీ: సెల్ఫోన్ కంటైనర్ నుంచి 2 కోట్ల సరుకు మాయం
డ్రైవర్లు భోజనం కోసం ఆగినప్పుడే చోరీ జరిగిందా... లేక ఇంకా ఎక్కడైనా ఆపినప్పుడు జరిగిందా...? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి ఆధ్వర్యంలో... డీఎస్పీ కృష్ణమూర్తి సూచనల మేరకు పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడ్డారు. దొంగల గాలింపును ముమ్మరం చేశారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
ఇదీ చూడండి:అధికారులు సహకరించటం లేదని సర్పంచ్ ఆత్మహత్యాయత్నం